మీ జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోయారా అయితే ఈ విధంగా మీరు తిరిగి పొందవచ్చు..

మీ జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోయారా అయితే ఈ విధంగా మీరు తిరిగి పొందవచ్చు..


మనం నిత్యం ఏదో ఒక రూపాన జిమెయిల్ వాడుతూ ఉంటాం కాబట్టి ఇంత ముఖ్యమైన ఈ జిమెయిల్ పాస్వర్డ్ను మరిచిపోవడం సమస్యగా ఉంటుంది. మీరు దీన్ని సులభంగా తిరిగి పొందగలిగితే సదుపాయం కూడా ఉంది దీని గురించి మనం పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.


కేవలం ఆఫీసు పనులు కే కావచ్చు లేదా వ్యక్తిగత జీవితంలోని అన్ని అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీకు జిమెయిల్ అకౌంట్ అవసరం అవుతుంది, అంతేకాదు మీరు ఆండ్రాయిడ్ ఫోను ఉపయోగిస్తే మీకు జిమెయిల్ ఖాతా తప్పనిసరి.


మీ జిమెయిల్ పాస్వర్డ్ మరిచిపోతే దానిని ఎలా ఆక్టివేట్ చేసుకోవాలి..


1. మొదట మీ జిమెయిల్ అకౌంట్ లేదా జి మెయిల్ ని తెరవండి.

2. ఇప్పుడు గూగుల్ లాగిన్ పేజీ లో ఫర్గెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. 

3. మీకు గుర్తుకు ఉన్న చివరి పాస్వర్డ్ను నమోదు చేయండి, మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే మరో మార్గం (Try another way)ప్రయత్నించండి పై ఎంచుకోండి.

4. మీ జీమెయిల్ ఖాతా కు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ కు గూగుల్ ఒక మెసేజ్ పంపుతుంది.

5. మీ ఫోన్ నెంబరు లేకపోతే గూగుల్ మీ ఈ మెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ను పంపుతుంది, మీకు ప్రత్యామ్నాయ ఈమెయిల్ లేక పోతే (Try another way) ను ఎంచుకోండి.

6. ఇక్కడ నీకు మరొక ఈమెయిల్ ఐడి ని గూగుల్ అడుగుతుంది.

7. ఇప్పుడు మీరు గూగుల్ నుండి ఈమెయిల్ వచ్చినప్పుడు గూగుల్ డైలాగ్ బాక్స్ పేజీ ని తెరవండి

8. రికవర్ అయిన తరువాత కొత్త పాస్వర్డ్ ఉపయోగించి మీ జీమెయిల్ లోకి లాగిన్ అవ్వండి.


గమనిక : పాస్వర్డ్ను ప్రతిసారి మార్చవద్దు, దానిని రాసుకోండి.  మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో లాగిన్ అవుతున్నప్పుడు మీ బ్రౌజర్లో సేవ్ పాస్వర్డ్నుఅడుగుతుంది అప్పుడు సేవ్ చేసుకోవచ్చు అయితే, మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్  ఇంకెవరు ఉపయోగించరు అని నిర్ధారించుకోండి. 

0 Comments

Post a comment

Post a Comment (0)

Previous Post Next Post