స్మార్ట్ ఫోన్ కొనే ముందు తప్పనిసరిగా వీటిని గమనించండి ..

స్మార్ట్ ఫోన్  కొనే ముందు తప్పనిసరిగా వీటిని  గమనించండి ..


స్మార్ట్ ఫోన్ ల డిమాండ్ చాలా  పెరిగింది. ఒకానొక  సమయంలో మొబైల్ ఫోను కొనుక్కోవటానికి ఒక మొబైల్ షాప్ కి వెళ్లి మన ఫేవరెట్ బ్రాండ్ ఫోను కొనే వాళ్ళు, అది చాలా సులభంగా అనిపించేది. కానీ ఈ రోజుల్లో వివిధ మొబైల్ తయారీ సంస్థల నుండి రకరకాల ఆఫర్లతో అనేక మొబైల్ ఫోన్స్ మనం చూస్తున్నాము. కానీ మనం గమనించాల్సింది ఏమిటంటే ప్రతి ఫోన్ లో వేరు వేరు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ ఫీచర్స్ తో వస్తున్నాయి, కాబట్టి వీటిలో మనకు ఏది సరైన ఎంపిక గా ఉంటుందో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది.


ముఖ్యంగా మీ బడ్జెట్ లో మీకు మీ వినియోగానికి తగిన విధంగా ఒక స్మార్ట్ ఫోన్ లో మీరు ఏమి కావాలనుకుంటున్నారో అనే విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తాయి. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు కొనవలసిన స్మార్ట్ ఫోన్ లో ఎటువంటి ప్రొఫెసర్ ఉంటే మీకు ఎటువంటి ఆటంకం లేకుండా మీ రోజువారి పని సులభంగా చేసుకోగలరో మీ అవసరాలను బట్టి ఎంచుకొనే లా ఇక్కడ మీ కోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ లోని ప్రొఫెసర్  గురించి మీకు సవివరంగా అందిస్తున్నాము.


ప్రొఫెసర్  అంటే ఏమిటి ?


స్మార్ట్ ఫోన్ యొక్క మెదడు గా మన ప్రొఫెసర్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఫోనులో మనం చేసే ప్రతి పనిని ప్రొఫెసర్ నిర్వహిస్తుంది, కంప్యూటర్లతో పోలిస్తే  మొబైల్ ఫోనులో ఇది పూర్తి  భిన్నంగా ఉంటుంది. కంప్యూటర్ లో అయితే వివిధ రకాలైన పనులు చేయటానికి వివిధ రకాలైన చిప్స్ తో కలిసి ఉంటుంది. అవన్నీ లేకుండా ఒక CPU పని చేయటం అసాధ్యం, అయితే ఫోన్ విషయానికి వస్తే ఇవి SoC (System on Chipset) తో పనిచేస్తాయి . ఒక ఫోన్ లో జరిగే అన్ని పనులను కేవలం ప్రొఫెసర్ మాత్రమే నిర్వహిస్తోంది ఉదాహరణకు చెప్పాలంటే ఫోన్ పవర్ ఆఫ్ మేనేజ్మెంట్ గ్రాఫిక్ ప్రాసెస్ చేయడం కెమెరా, వైఫై, సిగ్నల్ (3G,4G,LTE) మరియు ఇటువంటి అన్ని పనులను ఈ ప్రొఫెసర్ నిరంతరంగా నిర్వహిస్తోంది.


ఒక శక్తివంతమైన ప్రొఫెసర్ ద్వారా సున్నితమైన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్లు (App) వేగంగా ఓపెన్ చేయటం మరియు Gamming చేస్తున్నప్పుడు నెమ్మదించడం వంటి సమస్యలు ఉండవు ప్రస్తుతం మొబైల్ ఫోన్ల కోసం అత్యంత శక్తివంతమైన ప్రొఫెసర్.Qualcomm Snapdragon 855+ అందుబాటులో ఉంది కొన్ని నెలల క్రితం వరకు మ్యాప్ Snapdragon 845 మరియు  Snapdragon 855 అనేది టాప్ మొబైల్ cpu గా ఉండేది, కాబట్టి ఆ ప్రొఫెసర్ లతో ఉన్న ఫోన్లు పనితనం కూడా చాలా చక్కగా ఉంటుంది.


మార్కెట్లో మనం చూసే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు ఎక్కువగా Qualcomm ప్రొఫెసర్ లతో వస్తాయి,  Qualcomm ప్రొఫెసర్లు అన్ని హైఎండ్ స్మార్ట్ఫోన్ల కోసం MediaTek Helo  ఎంట్రీ స్థాయి స్మార్ట్ ఫోన్లు మరియు మిడ్ రేంజ్ స్టేట్మెంట్ కోసం రూపొందించారు.


మీరు సాంసంగ్ లేదా హానర్ ఫోన్ లను కొనుగోలు చేస్తే మీకు వాటిలో Exynos లేదా Kirin SoC ను వాటిలో ప్రత్యేకంగా చూడవచ్చు ఇక ఆపిల్ విషయానికి వస్తే ఆపిల్ దాని సొంత ప్రాసెసర్ను ఐఫోన్ కోసం వాడుతుంది, తాజాగా A13 బయోనిక్ చిప్ ను వాటికి ఫోన్ల కోసం అందుబాటులో తెచ్చింది Snapdragon మరియు మీడియా టెక్ ప్రొఫెసర్ల విషయానికి వస్తే సాధారణంగా Snapdragon ప్రొఫెసర్ మంచి పనితీరును కలిగి ఉంటాయి కానీ వీటి కోసం అధిక ధరను చెల్లించాల్సి వస్తుంది.


ప్రొఫెసర్ ఫీచర్స్ :


ప్రొఫెసర్ల విషయానికి వచ్చే వచ్చినప్పుడు పేరులో కనబడేది సంఖ్య దాని అధిక పనితీరును సూచిస్తుంది ఉదాహరణకు స్నాప్ డ్రాగన్ 885  స్నాప్ డ్రాగన్ 845 కంటే  మెరుగైనది, అలాగే  స్నాప్ డ్రాగన్ 845 స్నాప్ డ్రాగన్ 712  కంటే  ఉత్తమమైనది.


Cores :


ఎక్కువ Cores ఉంటే అధిక పనితీరు ప్రదర్శిస్తుంది, కాబట్టి Octo(8)Core సాధారణంగానే  Quard(4)Core కంటే మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక ఈ  quad core - Dual(2) Core కంటే  Octo(8)Core మరింత శక్తివంతమైన వీటిలో స్థిరమైన సంఖ్యలో Cores ఉన్నాయి. మరియు ఇది మీరు మార్చగలిగేది కాదు, కానీ మీరు ఒక ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం మీ బడ్జెట్ ను అనుసరించి ఎక్కువ లేదా తక్కువ Cores ను ఎంపికగా ఎంచుకోవచ్చు.


Clock Speed :


క్లాక్ స్పీడు నీకు మంచి పనితీరును అందిస్తుంది. అంటే నీ ప్రొఫెసర్ చేయగల పని వేగం ఎంత ఉంటుంది అనే విషయాన్ని సూచిస్తుంది.ఇది సాధారణం GHz గా   చెబుతారు  మరియు దీనిని అధిక సంఖ్య మీ ప్రొఫెసర్ యొక్క వేగాన్ని సూచిస్తుంది.  ఈ రోజుల్లో ప్రొఫెసర్ యొక్క అత్యధిక క్లాక్ స్పీడు 2.96 ఇదే అని చెప్పవచ్చు.


గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ :


గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా GPU మీ గేమింగ్ పనితీరు వంటి విషయాలకు మీ ఫోన్ పెర్ఫార్మన్స్ లో ప్రధాన భాగంగా బాధ్యత వహిస్తుంది. GPU ప్రాసెసర్ మీ స్మార్ట్ ఫోన్ ప్రొఫెసర్ లో ఒక భాగంగా ఉంటుంది, కాబట్టి ఎంచుకోవడం గురించి మీరు అంతగా  ఆలోచించాల్సిన అవసరం లేదు.

Post a Comment

Previous Post Next Post