ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ వేగంగా మరియు  smooth  గా  పని చేస్తోంది …!


ఈ రోజుల్లో మనం స్మార్ట్ఫోన్లను గతంలో కంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. covid 19 lockdown కారణంగా మన పని చాలా వరకు మొబైల్ లో నే అయిపోతుంది. మరియు మన laptop లతో పాటు స్మార్ట్ఫోన్లు ఆ పని అవ్వడానికి సహాయ పడుతున్నాయి,అంతే కాదు మన సామాజిక జీవితాన్ని పెంపొందించడంలో స్మార్ట్ఫోన్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి.


అయినప్పటికీ ఫోన్లు పాతవి అయ్యాక, అవి కొంచెం ఇంతకు ముందు కన్నా నెమ్మదిగా పనిచేస్తాయి. కాబట్టి, మీ ప్రస్తుత స్మార్ట్ ఫోన్ పని తీరును పెంచడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు మరియు ఉపాయాలు మీకు తెలియజేస్తాము.


యానిమేషన్ లను తగ్గించండి :


యానిమేషన్లు మీ ఫోను పనితీరును తగ్గిస్తాయి యానిమేషన్లు  నిలిపివేయటం వలన యాప్ ల మధ్య మారేటప్పుడు మీ ఫోను వేగంగా పనితీరు పెరుగుతుంది.

సాంసంగ్ లో : సెట్టింగ్స్ >  అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ >  రెడ్యూస్ అనిమేషన్

ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో, మొదట డెవలపర్ ఎంపికను ప్రారంభించడం ద్వారా దీన్ని మార్చవచ్చు. 

సెట్టింగ్స్ >  అబౌట్ ఫోన్  పై ఏడు సార్లు ప్రెస్ చేయండి. తరువాత  సెట్టింగ్స్ >  డెవలపర్ ఆప్షన్ కు వెళ్లి విండో అనిమేషన్  scale ను 0.5x కి తగ్గించండి . మరింత మెరుగైన పనితీరును సాధించటానికి  మీరు దాన్ని పూర్తిగా ఆపివేయడానికి కూడా ఎంచుకోవచ్చు.


ఉపయోగించని అంశాలను వదిలించుకోండి : 


కొన్ని నెలలు మన ఫోను అదే విధంగా ఉపయోగించడం వల్ల చాలా జంక్  స్టోర్ అవుతుంది. ఇందులో ఉపయోగించని  యాప్ లు, వేలాది ఫొటోస్ మరియు వీడియోస్, వాట్స్అప్ చాట్  మరియు మరిన్ని ఉంటాయి. ఇవన్నీ మీ స్మార్ట్ ఫోన్ లో స్థానికంగా నిల్వ చేయబడతాయి మరియు నిల్వ స్థలం నిండినప్పుడు, ఫోన్  మందగించడం మరియు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతుంది. దాన్ని నివారించడానికి, ఉపయోగించని యాప్  లను మరియు డేటాను ఎప్పటికప్పుడు తొలగించండి.


కాష్ క్లియర్ :


ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా  అనువర్తనాలు బ్రౌజ్ చేయడం లేదా యూట్యూబ్ లో వీడియోలు చూడటం నీ ఫోన్లో కొంత  కాష్  తీసుకుంటుంది.  కాలక్రమేణా ఈ కాష్ మీ స్థానిక నిల్వలు 2 జిబి  పైన తీసుకుంటుంది. 

సెట్టింగ్స్ > స్టోరేజ్ >  కాష్ డేటా  పై నొక్కటం ద్వారా మీ కాష్ డేటాను క్లియర్ చేసుకోవచ్చు. స్టాటిక్ వాల్ పేపర్లను ఉపయోగించండి :


వాల్ పేపర్లు మన ఫోను లను  కస్టమైజ్ చేయటానికి మనకు సహాయపడతాయి. లైవ్ వాల్ పేపర్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, అవి చాలా ప్రాసెసింగ్ పవర్ ని మరియు ఫోన్ యొక్క బ్యాటరీ ని చాలా వినియోగించుకుంటాయి. మీ ఫోను వేగవంతం చేయటానికి,  స్టాటిక్ వాల్ పేపర్లను ఉపయోగించడం ద్వారా  ఈ సమస్యను నివారించవచ్చు.  మీ లాక్ స్క్రీన్ తో పాటు హోమ్ స్క్రీన్ రెండింటికి ఓకే వాల్ పేపర్ ను ఉపయోగించడం ద్వారా మీరు ఎక్కువ స్థాయి పనితీరును సాధించవచ్చు.


విడ్జెట్స్ ను నివారించండి :


ఆపిల్ సంస్థ  తన iOS  అప్డేట్స్ లో  హోమ్ స్క్రీన్ కోసం విడ్జెట్స్ ను (Widgets) ప్రకటించింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ లో కూడా ఉంది. ఈ విడ్జెట్స్ అద్భుతంగా సమాచారాన్ని అందిస్తాయి అయితే ఇవి నిరంతరం అప్డేట్స్ అవ్వటానికి ఫోన్ యొక్క ప్రాసెసింగ్ పవర్ ని ఉపయోగిస్తాయి. కాబట్టి కొంత పని తీరును మెరుగుపరుచుకోవడానికి, మీరు మీ ఫోన్లో లో విడ్జెట్స్ ను ఉపయోగించకుండా ఉండాలి. 


మీ ఫోను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి :


కొన్నిసార్లు  యాప్ లు లేదా పాడైన  ఫైల్స్  వలన ప్రధాన పనితీరు సమస్యను కలిగిస్తుంది. ఫ్యాక్టరీ రీసెట్ దాన్ని పరిష్కరించడమే కాకుండా నీ ఫోనుకు కొత్త లైఫ్ ను ఇస్తుంది. మీరు మీ ఫోన్ యొక్క పూర్తి బ్యాకప్ తీసుకోవచ్చు మరియు దాన్ని అసలు స్థితికి రీసెట్ చేయవచ్చు. 


 

Post a Comment

  
 

Join daily-e-smart on telegram