అద్భుతమైన టెక్నాలజీతో వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్లు..!


ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ల ను ఉపయోగిస్తున్నారు . స్మార్ట్ ఫోన్ యొక్క బ్రాండ్లు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ తమ ఉత్పత్తులను కొత్తగా మరియు వినూత్నంగా కనిపించేలా కొత్త ఫీచర్లతో తయారు చేస్తున్నారు. మరియు అవి మిగిలిన బ్రాండ్లతో భిన్నంగా ఉండటానికి తన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోర్టబుల్ డిస్ప్లే,LIFI, ఫోన్లు మరియు అంతర్నిర్మిత “ఇయర్ బడ్”  వంటి కొత్త రకం ఫీచర్లతో కొత్త ఫోన్లను తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లను ప్రస్తుతం మనం ఊహించలేంనత ఫీచర్లు మరియు సౌలభ్యాన్ని అందించే ఆలోచనలో ఉన్నాయి. మొబైల్ కంపెనీలు తమ కొత్త స్మార్ట్ఫోన్లలో ఉపయోగిస్తున్న కొత్త టెక్నాలజీల గురించి మరికొన్ని వివరాలు నీకు తెలియజేస్తాము. 


కలర్ చేంజింగ్ గ్లాస్ ప్యానల్ స్మార్ట్ ఫోన్ :


వివో బ్రాండ్ ఇప్పుడు తన కొత్త స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక వైపు ప్యానెల్ను కలర్ చేంజింగ్ గ్లాస్ తో తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోను వెనుక భాగంలో ఎలక్ట్రో క్రోమిక్ గ్లాసును కలిగి ఉండి ఒక బటన్ నొక్కి నప్పుడు కలర్ మారే విధంగా తయారు చేస్తున్నారు. 


పోర్టులు మరియు పవర్ బటన్ లేని కొత్తరకం స్మార్ట్ఫోన్లు : 


వివో ఇప్పటికే తన కాన్సెప్ట్ స్మార్ట్ ఫోన్ లను నెక్స్ సిరీస్ లో విడుదల చేసే ఆలోచనలో ఉంది. ఇది ఎటువంటి బటన్ మరియు పోర్ట్ లు లేకుండా వస్తున్నట్లు సమాచారం .భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు బటన్ లెస్ మరియు పోర్ట్ లెస్ తో రావచ్చు. వైర్లెస్ చార్జింగ్ ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో  డేటా పోర్ట్ చార్జింగ్ టెక్నాలజీ కొన్ని సంవత్సరాల తరువాత అన్ని ఫోన్లలో అదృశ్యం అవ్వచ్చు.


ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు :


చాలా రకాల స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లు ఇప్పటికే సూపర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ టెక్నాలజీని తన స్మార్ట్ ఫోన్ లలో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ బ్రాండ్ లు అన్ని కూడా ఇప్పుడు ఇలాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ ద్వారా అందించాలని చూస్తున్నారు. అది కూడా కేవలం 30 నిమిషాలలో నీ ఫోను వైర్లెస్ విధానం ద్వారా పూర్తిగా ఛార్జ్ చేసే టెక్నాలజీని తీసుకురానున్నారు. 
Post a Comment

  
 

Join daily-e-smart on telegram