Video calls ను “ గూగుల్ హ్యాంగౌట్స్” ద్వారా ఆండ్రాయిడ్, ఐఫోన్,ఐప్యాడ్ లో ఎలా చేయాలి

Video calls ను “ గూగుల్ హ్యాంగౌట్స్” ద్వారా   ఆండ్రాయిడ్, ఐఫోన్,ఐప్యాడ్ లో  ఎలా చేయాలి

ఇప్పటికే చాలామంది  ప్రజలు ఒకరితో ఒకరు  మాట్లాడుకోవడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఉపయోగిస్తున్నారు. చాలా  యాప్స్  అందుబాటులో ఉన్నందున,  ఏది ఉపయోగించాలి  నిర్ణయించడం  మీకు కు కష్టమవుతుంది. 

మీకు జి-మెయిల్ అకౌంట్  ఉంటే  స్నేహితుడికి వీడియో కాల్  చేయాలనుకుంటే  లేదా మీ స్నేహితులు అందరిని ఒక వీడియో కాన్ఫరెన్స్ లో  తీసుకు రావాలి అనుకుంటే  మీరు గూగుల్ వారి  “Hangouts” ను  ఉపయోగించవచ్చు.

“Google Hangouts”  చాలా సులువుగా వ్యక్తుల తో  చర్చ, టెక్స్ట్, లేదా వీడియో ద్వారా కనెక్ట్ చేస్తోంది. అంతేకాకుండా వ్యక్తులను కాల్ మధ్యలోనే  గ్రూపుల్లో కనెక్ట్ చేయ సామర్థ్యం ఈ యాప్ కు కలదు.


Google Hangouts  లో  వీడియో కాల్  చేయడం ఎలా


మీరు మీ మొదటి వీడియో కాల్ ప్రారంభించడానికి  ముందు Hangouts కోసం సిస్టమ్,కెమెరా, మైక్రోఫోన్, మరియు స్పీకర్లను  నీ కంప్యూటర్  కు కనెక్ట్ చేయండి. మీ కంప్యూటర్లో  అప్డేట్ Hangouts  software  ఉందని   నిర్ధారించుకోండి.


డెస్క్ టాప్ ను ఉపయోగించి Google Hangouts  లో వీడియో  కాల్ ను  ఎలా  ప్రారంభించాలి.


1. మీ డెస్క్టాప్ లోని “Hangouts.google.com “ లేదా  జి-మెయిల్ లో సైడ్ బార్ లో  తెరవండి.
2. తరువాత Hangouts కాంటాక్ట్  నుండి ఒక వ్యక్తిని ఎంచుకోండి లేదా వారి పేరు లేదా ఈమెయిల్ 3. అడ్రస్.. కోసం సెర్చ్ చేయండి.మీకు కావలసిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని  వారి పేరును క్లిక్ చేయండి.

గమనిక:  గ్రూప్ వీడియో కాల్ ప్రారంభించడానికి మీరు  బహుళ వ్యక్తులను కూడా సెర్చ్ చేయవచ్చు

4. పేరు  ఎంచుకున్న తర్వాత వీడియో కాల్  సిమ్బెల్ ప్రెస్ చేయండి.


 ఆండ్రాయిడ్  ఉపయోగించి  Google Hangouts  లో  వీడియో కాల్  చేయడం ఎలా

1. మీ ఆండ్రాయిడ్ Google Hangouts  యాప్ ను  తెరవండి.
2. కుడి  దిగువన, కంపోజ్  పై నొక్కండి.
3. తరువాత  న్యూ వీడియో కాల్  నొక్కండి.
4. మీరు మీ వీడియో కాల్ కు   ఆహ్వానించదలచిన వ్యక్తుల పేర్లను  టైప్ చేయవచ్చు లేదా  సెర్చ్ చేసి ఎంచుకోవచ్చు.
5. ఎంచుకున్న తర్వాత వీడియో కాల్  సిమ్బెల్ ప్రెస్ చేయండి.

ఐఫోన్  మరియు  ఐప్యాడ్  ఉపయోగించి Google Hangouts లో  వీడియో కాల్  చేయడం ఎలా

1. మీ ఐఫోన్  మరియు ఐప్యాడ్ లో  Google Hangouts  యాప్ ను  తెరవండి.
2. దిగువన  కాంటాక్ట్స్ ను క్లిక్ చేయండి.
3. మీరు ఒకరి పేరు ను  టైప్ చేసి, లేదా  సెర్చ్ ద్వారా  వారిని ఎంచుకోవాలి.
4. తర్వాత వీడియో కాల్  సిమ్బెల్ ప్రెస్ చేయండి.


మీ ఐప్యాడ్ లో , మీరు Hangouts ను  తెరచి  కుడి నుండి  ఎడమకు swipe చేయడం ద్వారా  వీడియో కాల్  ప్రారంభించవచ్చు.

Hangouts  వీడియో కాల్ ద్వారా  స్నేహితులు, కుటుంబ సభ్యులు  లేదా  సహోద్యోగులతో 25 మంది వరకు  కనెక్ట్ కావచ్చు.

( సమాచార మూలం: గూగుల్ మద్దతు తో)












Post a Comment

Previous Post Next Post