under-screen camera : ఈ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ రూపురేఖలను మార్చేస్తుంది !!!

under-screen camera : ఈ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ రూపురేఖలను మార్చేస్తుంది !!!

ఈ శీర్షిక మొదలు పెట్టేముందు అసలు మొబైల్ కెమెరా టెక్నాలజీ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. కొన్నేళ్ల క్రితం కేవలం కొన్ని సంపన్న వర్గాలు మాత్రమే కెమెరాలను కొనుక్కుని వాడే స్తోమత ఉండేది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కెమెరా లేని మొబైల్ ఫోన్ లేదు అంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరా, ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్న స్మార్ట్ మొబైల్ ఫోన్స్ విరివిగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 

కంపెనీలు పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి, pop-up కెమెరా, షార్క్ రైసింగ్ కెమెరా, ఫ్లిప్ కెమెరా, ఇప్పుడు అండర్ స్క్రీన్ కెమెరా త్వరలో మన ముందుకి రాబోతుంది.

 మొబైల్ కెమెరా :

విషయానికి వస్తే, అసలు మొబైల్ కెమెరా ఎలా పని చేస్తుందో ముందు తెలుసుకుందాం. కెమెరా లెన్స్  బౌన్స్అయ్యే అన్ని కాంతి కిరణాలను  తీసుకొని ఒక గాజు ను ఉపయోగించి వాటిని ఒకే బిందువుకు మళ్ళిస్తుంది. దానిద్వారా ఒక చక్కటి చిత్రాలని సృష్టిస్తోంది. 

అండర్ డిస్ప్లే కెమెరా :

ఇప్పుడు కొన్ని ప్రముఖ మొబైల్ కంపెనీలు  ఈ కొత్త టెక్నాలజీని మన ముందుకి తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న అన్ని మొబైల్స్ లో స్క్రీన్ పై భాగమున కెమెరా అమరి ఉంటుంది. కానీ ఈ అండర్ డిస్ప్లే కెమెరా మీ మొబైల్ స్క్రీన్ లోనే  అంతర్గతంగా నిక్షిప్తమై ఉంటుంది.అంటే మీ మొబైల్ కి ఫ్రంట్ కెమెరా ఉందన్నా అనుభూతి కూడా కలగదు. ఈ కెమెరా ఒక దీర్ఘ చతురస్రాకార   ప్రదేశాన్ని కలిగి ,అతి తక్కువ ప్రతిబింబం తో  ఎక్కువ కాంతిని ప్రసారం చేయగల  ఒక ప్రత్యేకమైన  గాజు పలక  ఉపయోగిస్తారు. కెమెరా కూడా ప్రత్యేకమైంది - Large aperture, పెద్ద సెన్సార్, అధిక పిక్సెల్ పరిమాణం కలిగి  ఉంటుందని సమాచారం, ఇది ఇంకా  అభివృద్ధి దశలోనే ఉన్నాయి.   

త్వరలో ఈ అద్భుతమైన  టెక్నాలజీ మొబైల్ మార్కెట్లో  ఒక సంచలనం   సృష్టిస్తుంది  అంతేకాకుండా  స్మార్ట్ ఫోన్ రూపురేఖలను  మార్చేస్తుందని   ఆయా సంస్థలు  అభిప్రాయపడ్డాయి.

Conclusion : ప్రస్తుతం మాకు లభించిన సమాచారం  ఆధారం గా  మాత్రమే ఈ శీర్షికను ప్రచురించడం  జరిగింది, 

Post a Comment

Previous Post Next Post