Android మొబైల్ లో టెక్స్ట్ ఫైల్ ని ఆడియో ఫైల్ గా మార్చటం ఎలా ?


Android  మొబైల్ లో టెక్స్ట్  ఫైల్ ని  ఆడియో  ఫైల్ గా మార్చటం ఎలా ?


ఇతర మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పోల్చినప్పుడు,కచ్చితంగా ఆండ్రాయిడ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ మొబైల్ ఆపరేటింగ్  సిస్టం  పూర్తిగా Linex  పై ఆధారపడి ఉంటుంది .
అందుకే ఆండ్రాయిడ్ సిస్టంలో ఉన్నంత సౌలభ్యం మరి ఏ ఇతర మొబైల్ ఆపరేటింగ్ సిస్టం లో ఉండదు, మీరు ప్లే స్టోర్ లో చేసినట్లయితే వివిధ ప్రయోజనాల కోసం ఎన్నో  యాప్స్  మీరు చూడవచ్చు.

ఈరోజు మేము మా ఈ శీర్షికలో ఒక చిన్నTrick మీకు పరిచయం చేస్తున్నాం, సహజంగా చాలామందికి సుదీర్ఘ కథనాలు లేదా పోస్టులు చదవటానికి  ఆసక్తి లేని  ప్రతి ఒక్కరికి ఇది సహాయపడుతుంది.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్  ఫోన్లలో మీరు చదవాలి అనుకున్నా మొత్తం కథనాన్ని ఆడియో ఫైల్ గా మార్చటం ఎలా !!!, ఈ శీర్షిక ద్వారా మీకు పంచుకుంటున్నాను ,ఏదైనా కథనాన్ని ఆండ్రాయిడ్ లో ఆడియో ఫైల్ గా మార్చడానికి ‘ఎపిక్  ప్రైవసీ వెబ్ బ్రౌజర్‌ను ‘ ఉపయోగించి ఆడియో ఫైలు  గా మార్చుకోవచ్చు


వెబ్ పేజీలను ఆడియో ఫైల్ గా ఎలా మార్చాలో తెలుసుకుందాం :

1. మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ని  గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి ‘ఎపిక్  ప్రైవసీ వెబ్ బ్రౌజర్‌ను’  సెర్చ్ చేయండి.

2.‘ఎపిక్  ప్రైవసీ వెబ్ బ్రౌజర్‌ను’ డౌన్లోడ్ చేసుకోండి.

3. డౌన్లోడ్ చేసుకునే యాప్  ను ఇన్ స్టాల్ చేసుకోండి.

4. ఇన్ స్టాల్  చేసిన యాప్ తెరచి “అంగీకరించు &  కొనసాగించు” ఎంపికపై  క్లిక్ చేయండి.



5. ఇప్పుడు మీరు  ‘ఎపిక్  ప్రైవసీ వెబ్ బ్రౌజర్‌ను’ యొక్క వెల్కమ్ పేజీని చూడవచ్చు.

6. ఆడియో గా మార్చాలి అనుకునే  ఏదైనా కథనాన్ని ఎన్నుకోండి.

7. కుడి పైభాగాన కనిపించే, మూడు చుక్కల మెనూ పై క్లిక్ చేసి, ఆడియో క్యూకు జోడించు'  ని ఎంచుకోండి.



8. మరొక్కసారి మూడు చుక్కల మెనూ పైనొక్కండి, తరువాత 'ఆడియో క్యూ' ను సెలెక్ట్ చేసుకోండి.



9. ఇప్పుడు అక్కడ మీకు  ఆడియో వెర్షన్‌లో ఒక పేజీ  కనబడుతోంది.

10. ఆ పేజీలో ఆడియో వెర్షన్‌  వినటానికి ‘ ప్లే’ చిహ్నం  పై క్లిక్ చేయండి.

ఎపిక్  ప్రైవసీ వెబ్ బ్రౌజర్‌లో , అంతర్ నిర్మిత ఆడియో ప్లేయర్  ఆడియోను  ఆటోమేటిక్ గా  ప్లే చేస్తుంది.

 ఏదైనా  వెబ్ పేజీని  ఆడియో వెర్షన్‌ గా మార్చటానికి ఈ పద్ధతిని  ఉపయోగించవచ్చు.

 గమనిక :  ఈ ట్రిక్ కేవలం  ఆండ్రాయిడ్  డివైస్ లో మాత్రమే  పని చేస్తోంది.

Post a Comment

Previous Post Next Post