Whatsapp వీడియో కాల్ చేస్తున్నారా , మీ డేటాను ఈ విధంగా సేవ్ చేసుకోండి - Daily-e-smart

Whatsapp  వీడియో కాల్  చేస్తున్నారా ,  మీ డేటాను ఈ విధంగా సేవ్ చేసుకోండి - Daily-e-smart

కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి దేశము మరియు ప్రపంచము మొత్తము LOCK DOWN పాటిస్తుంది. ఈ సమయంలో మీ స్నేహితులను మరియు కుటుంబ సభ్యులతో అలాగే ఆఫీస్ సభ్యులతో కమ్యూనికేట్ చేయడానికి మనకి ఉన్న ఒక ముఖ్య సాధనం స్మార్ట్ ఫోన్. అలాగే వాట్సాప్, VoIP సేవలను ఉపయోగించి మన సమాచారాలను పంచుకోవచ్చు. ఆడియో లేదా వీడియో కాల్స్ కు అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్స్టెంట్ మెసేజింగ్  ప్లాట్ ఫామ్ లో  ఇది ఒకటి.

ఈ వీడియో కాల్స్ కి ఇంటర్నెట్ యొక్క వేగం ప్రధానం. తక్కువ ఇంటర్నెట్ వేగంతో అంత స్పష్టంగా ఉండదు. ఆండ్రాయిడ్ అధారిటీ నివేదిక ప్రకారం  వాట్సాప్ వాయిస్ కాల్స్ లో  నిమిషానికి 740 Kb వినియోగించుకుంటుంది.  అదే వీడియో కాల్స్ కి అయితే  డేటా వినియోగం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది . మరి ఇది నియంత్రించటానికి మనం ఏం చేయాలి? ఈ డేటా వినియోగం బాగా నియంత్రించటానికి ఈ క్రింద ఇచ్చిన సూచనలను అనుసరించండి

STEP-1

వాట్సప్ యాప్ ను తెరిచి  3 dots పాయింట్లను కనిపించే చోట  ప్రెస్ చేయండి

 తరువాత సెట్టింగ్స్ (SETTINGS) కి వెళ్ళు అక్కడ అ డేటా వినియోగము మరియు నిల్వలపై నొక్కండి ( DATA AND STORAGE USAGE)

ఇక్కడ అ కాల్ సెట్టింగ్ అనే  ఆప్షన్ క్రింద తక్కువ డేటా వినియోగం అనే    TAG ను    ఆక్టివ్ చేసుకోండి.

STEP-2

డేటా మరియు ఫోటో డేటా వినియోగాన్ని తగ్గించుకోవడానికి ఈ విధంగా చెయ్యండి

దీనికోసం మీరు  చేయగలిగేది  ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ ని నిలిపి వేయడమే. అది ఎలా ఆపివేయాలి అది ఎలాగో మీకు ఈ క్రింద  చూపిస్తాను

వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్ళండి

డేటా వినియోగము మరియు నిల్వలపై నొక్కండి ( DATA AND STORAGE USAGE)

Tap “when use mobile data” Uncheck all boxes and click OK

వైఫై ద్వారా కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు చాట్ బ్యాకప్ నుండి వీడియోలను ఎలా డిలీట్ చేయాలి ఈ క్రింద మీకు వివరిస్తాను

వాట్సాప్ లోని వీడియోలు అప్లోడ్ చేయడానికి మరియు డౌన్లోడ్ చేయడానికి మనం డేటాని వినియోగిస్తామని మీకు స్పష్టమైంది .ఏదైనా విలువైన అవసరమైన వీడియోలను సేవ్ చేసుకోవాలి అనుకుంటే లేదా బ్యాకప్ చేయాలి అనుకుంటే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు. మొదట  సెట్టింగులు > చాట్ బ్యాక్అప్ ఎంపిక చేసి బ్యాక్అప్ ఆప్షన్ను ప్రెస్ చేయండి .మీ విలువైన సమాచారాన్ని గూగుల్ డ్రైవ్ లో పొందుపరుస్తుంది




Post a Comment

Previous Post Next Post